తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు

Facebook
X
LinkedIn

  • మిస్‌ వరల్డ్‌ పోటీలతో తెలంగాణ రైజింగ్ ఊత
  • హైదరాబాద్ లో మే 7 నుంచి 31 వరకు వేడుకగా పోటీలు
  • తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక, ఆధ్యాత్మిక, మెడికల్ , సేఫ్టీ టూరిజం ను
    ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమ ప్రణాళికులు
  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • తెలుగునాడు, హైదరాబాద్ :
    ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మే 10 నుండి 31 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. మిస్ వరల్డ్ పోటీలను సువర్ణ అవకాశంగా మలుచుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తుంది.

“ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!” అనే స్లోగన్ తో ఈ ఈవెంట్ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.
ఈ నెల 2 నుంచి 8 వ తేదీ మధ్య వరకు
మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్ కు రానుnnaru
సుమారు 120 దేశాల నుండి కంటెస్టెంట్ లు, ఈ మేగా ఈవెంట్ లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ , ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్ , టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు.
మిస్ వరల్డ్ 2025 _ కార్యక్రమం ప్రయాణ ప్రణాళికలు, వేదిక
12.05.2025:బుద్ధిష్టు ఆధ్యాత్మిక పర్యటన
ఈ వేడుకలలో భాగంగా నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిష్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలియజేసేలా బుద్ధిష్టు ఆధ్యాత్మిక పర్యటన చేపడతారు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే యువతులు బుద్ధవనం ప్రాజెక్టును మే 12న సందర్శిస్తారు.

12.05.2025:హైదరాబాద్ హెరిటేజ్ వాక్
హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్ , లాడ్ బజార్ లలో “హెరిటేజ్ వాక్ ” నిర్వహిస్తారు.
13.05.2025: చౌమల్ల ప్యాలెస్ సందర్శన
హైదరాబాద్ కే తలమానికంగా నిలుస్తున్న ప్యాలెస్ను సందర్శిస్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ను తిలకిస్తారు.
14.05.2025: వరంగల్ హెరిటేజ్ సందర్శన
గ్రూప్ 1 లోని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్ లోని వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను సందర్శిస్తారు.
14.05.2025: రామప్ప ఆలయ సందర్శన
గ్రూప్ 2 లోని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంను సందర్శిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి నృత్యం ను తిలకిస్తారు.
15.05.2025: యాదగిరి గుట్ట ఆలయ సందర్శన
గ్రూప్ 1 లోని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు ఆధ్యాత్మిక టూరిజం లో భాగంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు.
15.05.2025: హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్సల్ టూర్
గ్రూప్ 2 లోని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్సల్ టూర్ లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు.
16.05.2025: మెడికల్ టూరిజం పై పరిచయం

వివిధ దేశాల నుండి రోగులను ఆకర్షించే ఉద్దేశ్యంతో మెడికల్ టూరిజం ను చేపడతారు.
హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు గ్రూప్ 1 మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు హాజరవుతారు. హైదరాబాద్ లోని ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను కాంటెస్టెంట్ లకు వివరిస్తారు. 16.05.2025: పిల్లల మర్రి వృక్ష సందర్శన గ్రూప్ _2 మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు.

16.05.2025: ఎక్స్పీరియం ఎకో పార్క్ సందర్శన గ్రూప్ _2 మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు సాయంత్రం హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్పీరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. 17.05.2025: మిస్ వరల్డ్ ఆటల తుది పోటీలు మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీలలో పాల్గొంటారు.

17.05.2025: రామోజీ ఫిలిం సిటీ సందర్శన ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు సందర్శిస్తారు.

18.05.2025: సేఫ్టీ టూరిజం మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను , ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనిషియేటివ్స్ ను పరిశీలిస్తారు. 18.05.2025: సచివాలయ సందర్శన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్ ను సందర్శిస్తారు.
20.05.2025 & 21.05.2025: కాంటినెంటల్ ఫినాలే
మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లను కాంటినెంటల్ క్లస్టర్ ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేసేందుకు
రీజియన్ _ స్పెసిఫిక్ ఫాస్ట్ _ ట్రాక్ సెలెక్షన్స్ నిర్వహిస్తారు.
20.05.2025 లేదా 21.05.2025: ఐపీఎల్ మ్యాచ్ కు హాజరు
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు గ్రూప్_1 కంటెస్టెంట్లు హాజరవుతారు.
21.05.2025: తెలంగాణ కళాకారుల చే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్
గ్రూప్_2 కంటెస్టెంట్లు శిల్పారామం లో తెలంగాణ కళాకారుల చే నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్ హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు.
22.05.2025: మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే
మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే లో కంటెస్టెంట్లు పాల్గొంటారు.
23.05.2025: H2H ఛాలెంజ్ ఫినాలే
హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే లో కంటెస్టెంట్లు పాల్గొంటారు.
24.05.2025: మిస్ వరల్డ్ టాప్ మోడల్ , ఫ్యాషన్ ఫినాలే & జ్యువెలరీ/ పెర్ల్ గది షో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే లో పాల్గొంటారు.
26.05.2025: బ్యూటీ విత్ ప్యాషన్
బ్యూటీ విత్ ప్యాషన్ లో కాంటెస్టెంట్ లు పాల్గొంటారు.
31.05.2025: మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే లోకాంటెస్టెంట్ లు పాల్గొంటారు.
చైర్‌పర్సన్, CEO జూలియా ఎవెలిన్ మోర్లీ కి ఘన స్వాగతం
మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా శుక్రవారం ( ఈ నెల 2వతేదీన) హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్ ,CEO శ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ , ఇతర అధికారులకు భారతీయ సంప్రదాయంలో ఘన స్వాగతం పలికారు.