తెలుగునాడు అమరావతి :
శ్రమ దోపిడి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు పోరాడారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సిఎం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందని, కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదని చెప్పారు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని సూచించారు. కార్మిక వర్గ పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.