ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో చూస్తున్నందున ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లొచ్చనే అంశంపై జానారెడ్డి , కేశవరావుతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి , ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు తో చర్చలు జరిపారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డి తో భేటీ అయ్యారు.

శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ , ప్రొ. హరగోపాల్ తో పాటు పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి మావోయిస్టులతో చర్చలు జరిపే అంశంపై ఒక వినతి పత్రాన్ని అందించారు.

ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కమిటీ ప్రతినిధులు కోరారు.