దృఢ సంకల్పం బలంగా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ ఉదాహరణ

Facebook
X
LinkedIn

ఎన్టీఆర్ కష్టపడి పైకొచ్చారు.

తెలుగునాడు, అమరావతి :

చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడు అయ్యారు. చిరంజీవి తన జీవితంలో పాజిటివ్ మైండ్‌సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించేవరకు నిరంతర కృషి చేశారు. ఎన్టీఆర్ ఉన్నంతకాలం చిరంజీవి ఒక స్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆకాశమే హద్దుగా చిరంజీవి మహానటుడిగా ఎదిగారు. నేను చదువుకునే సమయంలో నువ్వు బాగా చదవితే ఐఏఎస్ అవుతావని కొందరు చెప్పేవారు. ఐఎఎస్ అయితే పదిమందిలో ఒకడిని అవుతానని అనుకున్నాను. యూనివర్సిటీలో మా వీసీ పిలిచి లెక్టరర్ పోస్ట్ ఇస్తాను చేరతారా అంటే వద్దని చెప్పాను. ఎందుకని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాను. అనుకున్న ప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాక మంత్రి అవ్వాలని అనుకున్నాను. అప్పటి సీఎం చెన్నారెడ్డి దగ్గరకు వెళ్లి మంత్రిపదవి కావాలని అడిగాను. నిన్నటి వరకు యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న నువ్వు… ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి, అప్పుడే మంత్రి పదవి అడుగుతున్నావని అన్నారు. నాకు అర్హత ఉంటే ఇవ్వండని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాను.

ఆ తర్వాత రెండేళ్లకే సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాను. తర్వాత నందమూరి జయకృష్ణ సూచనతో ఎన్టీఆర్ ని కలిసిన తర్వాత భువనేశ్వరితో పెళ్లికి ప్రతిపాదన పంపారు. చిరంజీవి కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ కష్టపడి పైకొచ్చారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఛాలెంజ్, సంక్షోభం వస్తాయి. ఏ రాజకీయ నాయకుడికి రానన్ని సంక్షోభాలు నాకు వచ్చాయి. వాటిని బలంగా ఎదుర్కొని పైకి వచ్చాను. గాంధీ, అంబేద్కర్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అంబేద్కర్ అంటరాని తనం, అవమానాలు భరించి రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.