ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లు లేని పక్షంలో భారీ జరిమానా
న్యూఢిల్లీ :
ఢిల్లీ నగరంలో రవాణ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మోటర్ వెహికిల్ చట్టంలోన నిబంధనల ప్రకారం ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లు వాహనాలకు తప్పనిసరగా అంటించాలని లేని పక్షంలో భారీ జరిమానా ఉంటుందని వెల్లడించింది. ఈ నిబంధన పాటించని వాహనదారులపై రూ.5వేలు జరిమానా విధిస్తారని తెలిపింది. 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లో భాగంగా ఈ స్టిక్క్ర్లరులు అతికించాలి. ఈ స్టికర్ లేని వాహదారులకు జరిమాన విధించడమే కాక పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం డీజిల్ వాహనాలకు నారింజ రంగు, పెట్రోల్ & సిఎన్‌జిలకు నీలం రంగు, మిగిలిన వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు అంటించాలి.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.