మిస్‌ వరల్డ్‌ పోటీలను రద్దు చేయాలి

Facebook
X
LinkedIn

మిస్‌ వరల్డ్‌’’ అందాల పోటీలకు వ్యతిరేకంగా మేడ్చల్‌ జిల్లా రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది.


తెలుగునాడు, కాప్రా :


72అందాల పోటీలను రద్దు చేయాలని ప్రజా సంఘాలు నాయకులు ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం వినోద, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు నాగమణి,
ప్రగతి శిలా మహిళా సంఘం నాయకులు బిరకాయల లక్ష్మీ బాయి, చైతన్య మహిళా సంఘం, అల్లూరి సావిత్రి, డిఎస్‌ఎస్‌ నాయకురాలు ఎం యది లక్ష్మీ,
గృహ కార్మికుల యూనియన్‌ మేడ్చల్‌ జిల్లా అద్యక్షులు మంజుల, శోభ మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అందాల పోటీలు అంటేనే సామ్రాజ్యా వాదులు చేస్తున్న కుట్ర, మహిళలను బానిసలుగా మార్చే కుట్ర అని అన్నారు. ఈ తెలంగాణ ను పోరాటం చేసి సాధించున్న తెలంగాణలో అందాల పోటీలు జరపడం దుర్మార్గం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు 200 వందల కోట్లు ప్రకటించడం దుర్మార్గమైన పరిస్థితి అని గుర్తు చేశారు. మహిళలు వేల సంవత్సరాల నుండి బానిసత్వంలో జీవిస్తున్న స్త్రీలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న సందర్భంలో అందాల పోటీలు అంటూ పేద పిల్లలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కృంగి పోయేలా రంగుల ప్రపంచం అంటూ అందాలు అంటూ బానిసత్వం లో నెట్టివేస్తున్నారని. బడపెట్టుబడి దారులకు బ్యూటీ పార్లర్‌, స్విమింగ్‌ ఫుల్స్‌ లు పెద్ద వ్యాపారమై పోయిందని, స్త్రీ లను వ్యాపార వస్తువుగా చూస్తూన్నారని అన్నారు. స్త్రీ ల శరీరాలను కొలతలతో చూపడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఈ సమావేశం లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మహిల్ని పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేసి నిర్వహిస్తామని అన్నారు. మహిళలాంత ఏకమై ఈ అందాల పోటీలను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.