భూ భారతి 2025 చట్టాన్ని ప్రారంభించిన ఈరోజు చాలా చారిత్రాత్మకం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన భూ భారతి చట్టం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలుగునాడు, హైదరాబాద్ :

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో భూ భారతి 2025 చట్టాన్ని ప్రారంభించిన ఈరోజు చాలా చారిత్రాత్మకంఅని భూ భారతి చట్టం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారు చేసినది భూ భారత్ 2025 చట్టం అని ప్రకటించడానికి నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది

భూమికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది. అనేక పోరాటాల ద్వారా భూమిపై సాధించుకున్న హక్కులను, ఆ హక్కులు కాలరాయకుండ ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది

దురదృష్టం ఏమిటంటే…ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్నటువంటి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు తీసుకువచ్చినదే ధరణి చట్టం

గత పది సంవత్సరాలు శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్న నేను ధరణిపై చర్చ వచ్చిన ప్రతి సందర్భంగా చెప్పాను.

ధరణి అనేది రైతుల పాలిట శాపంగా మారింది కొంత మంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉందని ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు

గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కాలరాసింది.

2023 మార్చి 16న ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అనేక మంది రైతులు నా వద్దకు వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి మా భూములపై మాకు హక్కులను లేకుండా చేసిందని, మా వద్ద పాత పాస్ పుస్తకాలు ఉన్న కొత్తవి ఇవ్వడం లేదని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

పాదయాత్ర సందర్భంగా ఆరోజునే రైతులకు హామీ ఇచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది

ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో అనేక బహిరంగ సభలు నిర్వహించి కేంద్ర నాయకత్వాన్ని తీసుకువచ్చి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని, ప్రజలకు మేలు చేసే చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. రైతులకు చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ధరణిని మార్చడానికి అనేక రకమైన చర్చలు పెట్టి, రైతులందరికీ మేలు చేసేటువంటి భూ భారతి చట్టాన్ని తీసుకురావడానికి బిల్లును అసెంబ్లీలో పెట్టి రైతులకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టాన్ని ఈరోజు తెలంగాణ రైతులకు అంకితం చేస్తున్నాం

భూమి అంటే ఆత్మగౌరవం, నమ్మకం భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా కాపాడుతుందనే నమ్మకంతో రైతులను ముందుకు నడిపిస్తుంది

గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ శివారులో భూమిపై హక్కులు కోల్పోయిన ఓ రైతు విసిగివేసారి తహసిల్దారుపై పెట్రోల్ పోసి, తనపై కూడా పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకునే విధంగా దుర్మార్గమైన ధరణిని తెచ్చారు.

ఆరోజు సీఎల్పీ లీడర్ గా చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రైతు ఎమ్మార్వో పై పెట్రోల్ పోయలేదు. ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశాడని చెప్పినప్పటికీ ఆనాడు ఉన్న దుర్మార్గమైన పాలకులు పట్టించుకోలేదు.

ఇవన్నీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు హక్కులను కల్పిస్తూ మేలు చేయాలని తీసుకొచ్చిందే భూ భారతి చట్టం.

కలెక్టర్ల నుంచి కింది స్థాయి రెవెన్యూ అధికారుల వరకు ప్రజలకు ఈ చట్టం పట్ల విస్తృత అవగాహన కల్పించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి

ప్రజా ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టం మా కోసమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో అధికారులు కల్పించాలి

గత పాలకులు 10 సంవత్సరాలు అసైన్డ్ కమిటీల సమావేశం పెట్టలేదు. ఒక గజాన్ని కూడా పంచలేదు

భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ కమిటీలను పునరుద్ధరణ చేసి అసైన్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హత కలిగిన పేదవారికి ప్రజా ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తుంది

దేశంలో స్వాతంత్రం కోసం పోరాటాలు జరుగగా తెలంగాణలో భూమికోసం పోరాటాలు జరిగాయి. దున్నేవాడికే భూమి కావాలని పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగా వచ్చింది టెన్ఏన్సీ చట్టం.

ఉమ్మడి రాష్ట్రంలోనీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం టెన్ఏన్సీ చట్టం తీసుకొచ్చి దున్నే వాడికి భూమి కావాలని పోరాడిన రైతులకు పట్టాలు ఇచ్చి ఆనాటి పోరాటాలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది