టిఆర్ఎస్ ప్రభుత్వంలో పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదో!
* ఎమ్మెల్సీ కవిత వైఖరి చూస్తుంటే చంపినోడే సంతాపం తెలిపినట్టుంది
* బిఆర్ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని నియమించాలి
* బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ చేత కవిత ప్రకటింప చేయాలి
* కల్వకుంట్ల కవిత దీక్ష పై విరుచుకపడ్డ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ :
అసెంబ్లీలో కాదు హైదరాబాద్ నడి ఒడ్డున పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదో ముందు కవిత బీసీలకు సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కవిత దీక్ష పై జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్తాయి లో విరుచుకపడ్డారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైఖరి చూస్తుంటే చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బిఆర్ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని నియమించాలి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ చేత కవిత ప్రకటింప చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై కవిత మొసలి కన్నీరును బీసీలు ఎప్పటికీ నమ్మరు పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో బీసీలకు సమయం ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలను అణచివేయడానికే వారి నోరు మూయించడానికే బీసీ రాగం ఎత్తుకుంటున్న కవితఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జన పై కవిత కించపరుస్తూ మాట్లాడాడన్నీ తీవ్రంగా ఖండించారు. కవిత చేసే ధర్నాలకు బిఆర్ఎస్ పార్టీలోని బీసీ నేతల మద్దతు లేనే లేదు అందుకే ఆమె చేసిన ధర్నాలలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఎవరు పాల్గొనడం లేదు బీసీల పోరాటానికి కవిత మద్దతు అవసరం లేదు బీసీలకు అండగా ఉంటానని అనడం అంటే గొర్రెల మందకు తోడేళ్లు కాపలా ఉన్నట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. బీసీ సమస్యలపై బిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు పోరాటం చేస్తే వారికి మద్దతుగా నిలబడతాం బీసీల గురించి కవిత మొదటగా మాట్లాడాలంటే కులగననలో పాల్గొనని, బీసీ బిల్లుకు మద్దతు తెలుపని తన తండ్రి కేసీఆర్ ను మొదటిగా కవిత నిలదీయాలన్నారు. ఏప్రిల్ 11న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా మన్నారు. హైదరాబాదులోని సచివాలయం దగ్గరలో రెండు ఎకరాలలో జ్యోతిబాపూలే శృతి వనం ఏర్పాటుచేసి పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని, పార్లమెంటు ఆవరణలో పూలే దంపతుల విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టింప చేయాలని, జాతీయ మరియు రాష్ట్ర ప్రాజెక్టులకు ఎయిర్ పోర్టులు, నేషనల్ పార్కులకు మహాత్మ జ్యోతిబాపూలే పేరు పెట్టాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.