తెలుగునాడు, కీసర :
సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో నాగారం కాంగ్రెస్ నేతలు భోజనం చేశారు. నాగారం మున్సిపాలిటీలో నివాసముంటున్న సన్నబియ్యం లబ్ధిదారులు రాగుల లక్ష్మి, గడ్డం కళమ్మ, వంగపల్లి మమత, ఆరుట్ల స్వాతి ఇంటి వద్ద భోజనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పై వారి అభిప్రాయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు… ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ చేపట్టడం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సాధ్యమైందని తెలిపారు..ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ మాజీ సర్పంచ్ గూడూరు అశోక్ గౌడ్, మాజీ ఎంపిటిసి పంగ ముత్యాలు, మాజీ కౌన్సిలర్లు పంగ హరి బాబు, మాదిరెడ్డి వెంకటరెడ్డి, సూరి శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డ్ నెంబర్ కిల్లర్ శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఘనపురం కొండల్ రెడ్డి, అన్నంరాజు సురేష్ , బీసీ సెల్ అధ్యక్షులు రాంగోని శ్రీనివాస్ గౌడ్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు పంగ సంతోష్ , యూత్ కాంగ్రెస్ నాయకులు ర్యాల్య సన్నీ యాదవ్ , కే రవి గారు మనోహర్ చెల్లా , కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
