యాజమాన్యానికి రూ. 5 లక్షలు జరిమానా
గడువు ముగిసిన పిసి పిఎన్‌డిటి సర్టిఫికేట్‌తో కొనసాగుతున్న సేవలు
ప్రజలకు అవసరమైన ధరల జాబితాను ప్రదర్శించకపోవడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు.
డాక్టర్ల జాబితాలో తప్పుదోవ పట్టించే సమాచారం
తెలుగునాడు, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల వివరాల్లో అసత్య సమాచారం ఇవ్వడం ద్వారా రోగులను తప్పుదోవ పట్టించారు.
పిసి పిఎన్‌డిటి సర్టిఫికెట్ రెన్యువల్ సంబంధించి తప్పు సమాచారం, సర్టిఫికేట్ రెన్యువల్ పై అసత్యంగా నివేదించడం జరిగింది. అనధికారికంగా అల్ట్రాసౌండ్ యంత్రం వినియోగం, రెన్యువల్ లేకుండా అల్ట్రాసౌండ్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మరియు పాలీక్లినిక్‌లో అనధికారిక వైద్య ప్రాక్టీస్ సంబంధిత అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించారు. మరియు లైసెన్స్ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమించకపోవడం నందున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజ్గిరిలోని అనుకృష్ణ హాస్పిటల్ పై తీవ్రమైన మేడ్చల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. సి ఉమా గౌరీ చర్యలు తీసుకున్నారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. సి ఉమా గౌరీ, రెవిన్యూశాఖ, పోలీసు అధికారుల సమక్షంలో హాస్పిటల్ లోని ఉల్లంఘనలపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకోబడ్డాయి.
అనుకృష్ణ ఆసుపత్రి యాజమాన్యానికి రూ. 5,00,000 జరిమానా విధించబడిరది, అదనంగా, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ 60 రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేస్తూ మరియు యాజమాన్యం పై కేసులు నమోదు చేసందుకు ఆదేశాలు ఇచ్చారు. హాస్పిటల్ ప్రాంగణాన్ని తక్షణమే అనధికార వైద్య పద్ధతులు కొనసాగించకుండా అన్ని వైద్య పరికరాలు మరియు డయగ్నోస్టిక్ ఉపకరణాలు జప్తు చేయబడ్డాయి. ప్రజల ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని ఇట్టి చర్యలు తీసుకున్నాం అని మేడ్చల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. సి ఉమా గౌరీ తెలిపారు.