డిజిటల్ రేషన్ కార్డు: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

Facebook
X
LinkedIn

భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కేంద్రం.. డిజిటల్ ఇండియా కింద ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవల క్యూఆర్ కోడ్ పాన్ కార్డు (పాన్ 2.0) గురించి ప్రస్తావించింది. కాగా ఇప్పటికే డిజిటల్ రేషన్ కార్డును తీసుకురాడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది. ఇంతకీ ఈ డిజిటల్ రేషన్ కార్డును ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

డిజిటల్ రేషన్ కార్డు అనేది.. సాధారణ రేషన్ కార్డుకు డిజిటల్ వెర్షన్. దీనిని ఉపయోగించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
•ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ‘మేరా రాషన్ 2.0’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
•మేరా రాషన్ 2.0 యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత, ఓపెన్ చేస్తే స్క్రీన్‌పైన ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయమని ఉంటుంది.
•ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
•మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత వెరిఫై క్లిక్ చేయాలి.
•ధ్రువీకరించిన తరువాత.. మీ డిజిటల్ రేషన్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.