తెలుగునాడు అమరావతి :
ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేసాడు శ్రీ రామచంద్రుడు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందాం. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.