విద్యతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం..

Facebook
X
LinkedIn

స్పెషల్ కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి

సెరినిటీ స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రధానం

విద్యతో పాటు విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలి. విద్య అంటే కేవలం పుస్తకాల చదువు మాత్రమే కాదు, మంచి ప్రవర్తన, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దడం కూడా విద్యావ్యవస్థ లక్ష్యం అని సెరినిటీ స్కూల్
స్పెషల్ కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి అన్నారు.
నాగారం సెరినిటీ మోడల్ హైస్కూల్లో ఐఐటి ఫౌండేషన్ పరీక్షల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థిని, విద్యార్థులను సన్మానించే కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ స్పెషల్ కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, ముఖ్య కార్యదర్శి నోముల వసంత రెడ్డి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా జంగిరెడ్డి మాట్లాడుతూ.. సెరినిటీ స్కూల్ నుండి ఎన్నో మంది విద్యార్థులు వెలుగులోకి వచ్చారని గుర్తు చేసిన జంగిరెడ్డి, విద్యలో మంచి జ్ఞానం పెంపొందించడం, అన్ని రంగాల్లో విద్యార్థులను సిద్ధం చేయడం తమ లక్ష్యమని తెలిపారు.
సెరినిటీ స్కూల్ విద్యతో పాటు ఆటల పోటీలు, యోగా, వ్యాసరచన వంటి రంగాలలోనూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తోంది. వారి సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం,” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుబ్బారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.