విద్యార్థులకు ఇష్టమైన రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి

Facebook
X
LinkedIn

అను పబ్లిక్ స్కూల్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, గూడూరు సబిత ఆంజనేయులు గౌడ్

తెలుగునాడు, కీసర :

నాగారం మున్సిపాలిటీ ఎస్వి నగర్ కాలనీ రోడ్ నెంబర్ – 5 లో గల అను పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి,7వ వార్డు మాజీ కౌన్సిలర్ గూడూరు సబిత ఆంజనేయులు గౌడ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన సాంకేతిక ప్రదర్శన ప్రతిభకు ముగ్దరాలు అయ్యారు. విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లల ప్రతిభ ను గుర్తించి వారికీ ఇష్టమైన రంగంలో రానించే విధంగా విద్యార్థుల తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామల కుమారి, టీచర్స్ శ్రీ సుధా, అపర్ణ,దుర్గా భవాని,కుమారి,కిరణ్ సింగ్,విజయ దుర్గా, మాధవి,సరోజినీ, శిరీష,అనిత,కరుణ, మాధవి, సారిక, వర్థిని, రత్నకుమారి, రజని, శ్వేతా, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు