రైళ్లలో మహిళలపై పెరిగిపోతున్న లైంగిక దాడులు
వికలాంగురాలిపై అత్యాచారo చేసిన నిందితునిపై 2016 RPD చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి
NPRD రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్ డిమాండ్
తెలుగునాడు, హైదరాబాద్ :
రక్కేల్ -సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ రైలులో అర్థరాత్రి వాష్ రూమ్ కు వెళ్లిన ఆటీజం కలిగిన(వికలాంగురాలు) బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) మేడ్చల్ మహిళా విభాగం NPRD జిల్లా కమిటీలు డిమాండ్ చేస్తున్నవి.
రైళ్లలో వరుసగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నావి. మార్చి నెలలో మేడ్చల్ కు వెళ్లే MMTS రైలులో బాలికపై అత్యాచార యత్నం ఘటన మరువకముందే మళ్ళీ ఆటీజం కలిగిన వికలాంగురాలిపై లైంగిక దాడి జరిగినది. రైలులలో మహిళలకు భద్రత లేదనే దానికి ఈ మధ్యలో జరిగిన ఘటనలే నిదర్శనం. రైల్వే భద్రత వైపల్యం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నవి.మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది. రైలల్లో పోలీస్ భద్రత పెంచాలి. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ఆటీజం కలిగిన బాలికపై లైంగిక దాడి చేసిన నిందితునిపై 2016 RPD చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని NPRD మేడ్చల్ జిల్లా కమిటి డిమాండ్ చేస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ డిమాండ్ చేశారు.
కె చంద్రమోహన్ అధ్యక్షులు, కె నాగలక్ష్మి ప్రధాన కార్యదర్శి, కోశాధికారి జె మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుల్తాన్ రమేష్, షైన్ బేగం NPRD మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తదితరులు డిమాండ్ చేశారు.