ఎత్తిపోతల పథకానికి రూ. 10 కోట్లు విరాళమిచ్చిన కారుమంచి ప్రసాద్

Facebook
X
LinkedIn

ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ సీఎం చంద్రబాబుకు అందజేశారు

సొంత ఊరితో పాటు సొంత ప్రాంతాభివృద్థికి విశేషంగా కృషి చేస్తూ, 5,315 ఎకరాల సాగు స్థిరీకరణకు కొమ్మమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం రూ. 50 లక్షల విరాళాన్ని సెప్టెంబరులో సీఎం చంద్రబాబుకు అందజేసిన విషయం తెలిసిందే..
వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పిన అనుభం ఉన్న ఆయన భవిష్యత్తులో రైతాంగానికి ఉపకరించడం కోసం గుంటూరు జిల్లా కాకుమానులో రూ. 25 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రసాద్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను త్వరలో ప్రారంభించబోతున్నారు.
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంగల కారుమంచి ప్రసాద్ జన్మభూమిపై మమకారాన్ని మాత్రం వదులుకోలేదు. ఎస్టీ కాలనీలో రూ. 65 లక్షలతో కమ్యూనిటి హాలును నిర్మించి ఇచ్చారు.
పాతికేళ్ల క్రితమే లక్షల రూపాయలు వెచ్చించి కాకుమాను ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. పొలాలు ముంపునకు గురవడంతో మురుగునీటి పారుదల కోసం లక్షలు వెచ్చించి ఆ కాలువలను తవ్వించారు. తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటుని నిర్మించి ఇచ్చారు.
విద్యాభివృద్థిలో భాగంగా తాను చదువుకున్న కాకుమాను జడ్పీ హైస్కూలు అభివృద్థికి సింహభాగం ఆర్థిక సహాయం అందించారు. కంప్యూటర్ శిక్షణకు 13 కంప్యూటర్లు, విద్యార్థులకు సైకిళ్లు సమకూర్చారు. పేదవిద్యార్థులకు అలాగే విదేశీ ఉన్నత విద్యకోసం వెళ్లే వారికి, వైద్యవిద్య విద్యార్థులకు విరివిగా ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్నారు.
మహిళా సాధికారతలో భాగంగా మహిళా మండలి భవనానికి స్థలం సమకూర్చారు. మహిళల ఆర్థికాభివృద్థి కోసం వివిధ రకాల శిక్షణ తరగతుల నిర్వహణకు ఆర్థికంగా సహకరించారు. కాకుమానులోని అన్ని దేవాలయాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందజేశారు.
ఎన్నో రకాల గుప్తదానాలు చేసి తన దాతృత్వం చాటుకోవడంతో పాటు సమాజాభివృద్థికి సహాయ సహకారాలు అందజేస్తున్న కారుమంచి ప్రసాద్ కు అందరి నుంచి అభినందనలు అందుతున్నాయి.