యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : కోమటి రవి

Facebook
X
LinkedIn

మేడ్చల్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శ వర్గ సభ్యులు కోమటి రవి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు తాజా తీర్పును స్వాగతిస్తూ మేడ్చల్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శ వర్గ సభ్యులు కోమటి రవి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు యూనివర్శిటీ భూములను కాపాడే దిశగా ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి భూమి విక్రయం పై తాత్కాలికంగా నిలుపుదల విధిస్తూ, భూస్వామ్య హక్కులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. కోర్టు యూనివర్శిటీ భూముల పరిరక్షణకోసం చట్టపరమైన మార్గాలను పరిశీలించాలని సూచించింది.ఈ తీర్పుతో భవిష్యత్తులో విద్యా సంస్థల భూముల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తుందని, ప్రభుత్వ భూవినియోగ విధానంపై విస్తృత చర్చ మొదలైందని కోమటి రవి అభిప్రాయపడ్డారు.

విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలి..

యూనివర్శిటీ భూముల పరిరక్షణ కోసం పోరాడిన విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కోమటి రవి డిమాండ్ చేస్తున్నారు. యూనివర్శిటీ లోని 400 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు శాంతియుత నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా విద్యార్థులను పోలీసులు నిర్బంధించడమే కాకుండా, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో విద్యార్థులు, యూనివర్శిటీ హక్కుల పరిరక్షణ కోసమే పోరాడారని, వారిపై కేసులు ఉపసంహరించుకోవాలిని కోరారు.
శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. విద్యార్థులపై ఉన్న అన్ని కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నగరం విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందాలంటే విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలి

హైదరాబాద్ వంటి మెట్రో నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే విద్యా పరిశోధన పర్యావరణ పరిరక్షణ ముఖ్యమైన అంశాలు..ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు భవిష్యత్తు విద్యార్థులకు శాస్త్రవేత్తలకు ప్రధానమైన వనరు.. ఈ భూములను వాణిజ్య ప్రయోజనాల కోసం విక్రయించడం కంటే, వాటిని విద్యా, పరిశోధన అభివృద్ధికి కేటాయించడం సముచితం.

పరిశోధన విద్యా కోసం భవిష్యత్తు అవసరాలు

విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలే కాదు, పరిశోధనలకు ముఖ్యమైన ప్రదేశాలు.
నూతన శాస్త్ర సాంకేతికతలు, ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణాన్ని ఇవి అందిస్తాయి..

పర్యావరణ పరిరక్షణ
నగరం లో పెరుగుతున్న కాంక్రీటీకరణ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
విశ్వవిద్యాలయ ప్రాంగణాలు పచ్చదనం జీవవైద్యం కాపాడే కేంద్రాలు.

విద్యాభివృద్ధి తోనే.. నగరభివృద్ధి …

విద్యాసంస్థల అభివృద్ధితోనే నగర అభివృద్ధికి స్థిరమైన పునాదులు వుంటాయి.
ఐటీ కంపెనీలు, పరిశ్రమలు పుట్టుకుపోతున్నా, వాటికి మేధస్సును అందించేది విశ్వవిద్యాలయాలే. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు యూనివర్సిటీ భూములను పూర్తిగా విద్యా పరిశోధన కోసమే కేటాయించాలి. భూములు వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు కాకుండా, భవిష్యత్తు విద్యార్థుల అవసరం దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి అనేది భవనాలు కట్టడం కాదు, జ్ఞానాన్ని పెంపొందించడం.. నగరం నిజమైన అభివృద్ధి సాధించాలంటే విద్యాసంస్థలను బలోపేతం చేయాలి, విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలి.