బీసీ కుల మహా గర్జన విజయవంతం

Facebook
X
LinkedIn

కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి.
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి..

తెలుగునాడు, హైదరాబాద్ :

బీసీ రిజర్వేషన్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీల మహా గర్జన విజయవంతం కావడం సంతోషంగా ఉందని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అన్నారు. ఈ మహా గర్జనను చూసైనా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జేఏసీ కార్యాలయం నుండి గణేష్ చారి పత్రిక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని దీనికి పాలకులే కారణమన్నారు. ప్రభుత్వాలు మారుతున్న బీసీల స్థితిగతులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలు తీసుకవస్తున్న బీసీల కులవృత్తులు కనుమరుగవుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. దేశంలో 90 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు తగినట్టుగా బడ్జెట్, రిజర్వేషన్లు లేకపోవడమే వెనుకబాటు తనానికి కారణమన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చి చట్టసభలో బిసి బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపడం సంతోషకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.ఈ మహాగర్జనతో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి మంత్రులు తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు బీసీలు పెద్ద ఎత్తున తరలి రావడం బిసి వాదానికి బలం చేకూరిందని, మాహా గర్జనకు వచ్చిన బిసి సంఘాలు నాయకులతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.