సిపిఐ(ఎం) 24వ అఖిలభారత మహాసభ సందర్భంగా

Facebook
X
LinkedIn

మధురై :

సిపిఐ(ఎం) 24వ అఖిలభారత మహాసభ సందర్భంగా తమిళనాడుకే ప్రత్యేకమైన, అక్కడి వారికే సాధ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. గత పోరాటాలను గుర్తుకు తెచ్చుకుంటూ, నాటి యోధుల త్యాగాలను స్మరించుకుంటూ గాయకులు ఆలపించిన పాటలు స్ఫూర్తినింపాయి. నాలుగేళ్ల బుడతడి నుంచి నలభై ఏళ్ల మధ్య వయస్కుడి వరకూ ఎర్ర చొక్కాలు ధరించి, ఎర్ర జెండాలు చేబూని నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌ ‘ఔరా…’ అనిపించింది.

ఈ కోలాహలంతో కూడిన ఉత్సాహపూరిత వాతావరణంలో వెణ్మణి అమరవీరుల స్మారకార్థం అక్కడి నుంచి తెచ్చిన అరుణ పతాకాన్ని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యు.వాసుకి అందుకున్నారు. ఆమె ఆ పతాకాన్ని పార్టీ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎకె పద్మనాభన్‌కు అందజేశారు. అనంతరం సిపిఐ (ఎం) సీనియర్‌ నేత బిమన్‌ బసు ఆ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.