ఈనెల 27న భీమవరం రానున్న పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ .. చైతన్య భారతి నాటక పరిషత్
తెలుగునాడు, భీమవరం :
ఈనెల 24 నుంచి 27వ తేదీల్లో భీమవరం లోని డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో “చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. దీనిలో భాగంగా శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను నాటక పరిషత్ సభ్యులు కలిశారు. ఈ నాటక పరిషత్ మహోత్సవానికి రావాలని కోరడంతో ఈనెల 27న వస్తున్నట్లుగా వారు తెలిపారు. 17 ఏళ్లుగా భీమవరంలో చైతన్య భారతి నాటక పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి లో నాటక పోటీలను నిర్వహిస్తుందని, పలువురికి చైతన్య పురస్కారాలను అందించి సత్కరిస్తున్నట్లు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో నాటక పరిషత్ కార్యదర్శి మంతెన రామ్ కుమార్ రాజు,డా” కట్రెడ్డి సత్యనారాయణ, పి ర్. ఓ.భట్టిప్రోలు శ్రీనివాసరావు, పేరిచర్ల లక్ష్మణ వర్మ తదితరులు పాల్గొన్నారు.