సిపిఎం అఖిల భారత మహాసభలు ప్రారంభం సందర్భంగా మేడ్చల్ జిల్లా కార్యాలయం వద్ద జండా ఆవిష్కరణ
తెలుగునాడు, కాప్రా :
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అఖిలభారత మహాసభలు తమిళనాడు మదురై నగరంలో ఈరోజు ప్రారంభం అవుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో కమలానగర్ పార్టీ జిల్లా ఆఫీసు వద్ద పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహిం చారు. పార్టీ జిల్లా ఆఫీసు కార్యదర్శి ఎం శ్రీనివాసరావు పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. శ్రీనివాస రావు మాట్లాడుతూ పార్టీ అఖిలభారత మహాసభలు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకోవడానికి ఏప్రిల్ 2 నుండి ఆరవ తేదీ వరకు మదురైలో జరుగుతు న్నాయని, అక్కడ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు పార్టీని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ పార్టీ విడుదల చేసిన ముసాయిదాల్లో ఆత్మ విమర్శనాపూర్వకంగా రూపొందించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించిందని అన్నారు. వాటిని కూలంకషంగా చర్చించి పార్టీ నిర్ణయాలు చేస్తుందని దాన్ని కట్టుబడి అందరూ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పార్టీ మాజీ జిల్లా కమిటీ సభ్యులు వెంకట్ మాట్లాడుతూ పార్టీ నిర్దేశించుకున్న కర్తవ్యాలను ఇంకా మెరుగైన విధంగా ముందుకు నడిపించడం కొరకు పార్టీ మహాసభలు దిశా నిర్దేశం చేస్తాయని, దానికి కట్టుబడి మనందరం ఉండాలని కోరారు. సీనియర్ పాత్రికేయులు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పార్టీ సిపిఎం పార్టీ అని ఒక నివేదికలో వచ్చిందని అన్నారు. అటువంటి గొప్ప పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు నడవాలని కోరారు. మహిళా ఉద్యమ నాయకురాలు శారద మాట్లాడుతూ పార్టీ నిర్ణయాలను ఆశయాలను విశితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం అందరూ పార్టీ పతాకానికి రెడ్ సెల్యూట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, వెంకట్, గద్దల నరసింహారావు, పిబి చారి, శారద తదితరులు పాల్గొన్నారు.