రోడ్డు భద్రత కాదు, “రోడ్ బాధ్యత”

Facebook
X
LinkedIn

తెలుగు నాడు, హైదరాబాద్

DPS నాచారం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఒక విశేషమైన కార్యక్రమాన్ని చేపట్టింది— ఇది విద్యార్థుల్లో ట్రాఫిక్ భద్రత మరియు బాధ్యతాయుత రోడ్డు ప్రవర్తన గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన పైలెట్ ప్రాజెక్ట్.

DPS నాచారం వద్ద నగరంలో మొదటిసారిగా చేపట్టిన ఈ ట్రాఫిక్ పార్క్ ప్రారంభోత్సవ  ఈ కార్యక్రమానికి గవర్నర్ జిశ్ణు దేవ్ వర్మ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (TR & B) వికాస్ రాజ్, DPS సంస్థ నిర్వహకులు: చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ శ్రీమతి పల్లవి, CEO & డైరెక్టర్ యశస్వి మల్కా, డైరెక్టర్ శ్రీమతి త్రిభువన, సీనియర్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ శ్రీమతి సునీతా రావు ఇతర గౌరవనీయుల సమక్షంలో ఈ కార్యక్రమం 3 గంటలకు అట్టహాస౦గా ప్రార౦భమై౦ది.. DPS విద్యార్థులు ట్రాఫిక్ పార్క్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా NCC టీమ్ మరియు నేషనల్ అచీవర్స్ నేతృత్వంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ప్రారంభమైనది, దీపప్రజ్జ్వలనతో పాటు OMG ల్యాబ్, వర్ణలేపన కళా గ్యాలరీ, రికార్డింగ్ స్టేషన్ మరియు ఆడిటోరియమ్ సందర్శన జరిగింది..

గవర్నర్ జిశ్ణు దేవ్ వర్మ వారి ప్రసంగంలో రోడ్డు భద్రతపై వారి ఆలోచనలను పంచుకున్నారు, ఇది కేవలం భద్రత కాదు, “రోడ్ బాధ్యత” అని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు స్కూళ్లలో చేపట్టడం చాలా ముఖ్యమని, ఒక జీవితాన్ని కూడా రక్షించగలిగితే అది స్ఫూర్తిదాయకమని చెప్పారు. DPS నాచారం పాఠశాల ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పని చేస్తున్నదని ఆయన ప్రశంసించారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో పాటుగా జై  విజ్ఞాన్, జై అనుస౦ధాన్ లను కూడా కలుపుకోవాలని ఆకా౦క్షి౦చారు.

రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ పార్క్ అవసరం మరియు ప్రాధాన్యతను మరింత స్పష్టంచేసి, విద్యార్థులు తమ కుటుంబాల్లో ఈ అవగాహనను విస్తరించడానికి ప్రయత్నించాలని కోరారు.

సీనియర్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ శ్రీమతి సునితా రావు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, పాఠశాల గత 20 సంవత్సరాలలో చేసిన ప్రగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ మల్కా కొమరయ్య గారు పల్లవి మరియు DPS స్కూల్స్ యొక్క విద్యా ప్రయాణం గురించి, అలాగే విద్యార్థుల, పర్యావరణం మరియు సమాజం కోసం భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమం, DPS మరియు PGOS బ్రాంచీల కోసం రీసెర్చ్ అండ్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ (R&R) అధికారిక ప్రారంభంగా కూడా నిలిచింది. ఈ విభాగం విద్యా ఉత్తమతను ప్రోత్సహించడంలో సహాయపడగలదని, అందరికీ నిరంతర అభివృద్ధి జరగాలని సంకల్పించింది.

ఈ సందర్భంలో డిపీఎస్ మరియు పీజీఓఎస్ శాఖల రీసెర్చ్ అండ్ రిసోర్సెస్ (R&R) విభాగం అధికారికంగా ప్రారంభమైంది.

ప్రతి స౦వత్సర౦ డిపీఎస్ విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటే “జాయ్ ఆఫ్ గివింగ్” అనే వార్షిక డిపీఎస్ సంప్రదాయ౦లో భాగ౦గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్, రీయూజబుల్ వాటర్ బాటిల్స్, టవల్స్, నాప్కిన్స్, స్టేషనరీ సరఫరాలు, ముడి ఆహారం, స్టీల్ పాత్రలు, శీతాకాల దుస్తులు మరియు శానిటర్ ఉత్పత్తులను విరాళంగా 15పైగా ఎన్‌జీఓలకు అ౦దజేశారు.

విశిష్ట అతిథి వికాస్ రాజ్ ఈ సందర్భంలో తమ విలువైన స౦దేశ౦ ద్వారా సహానుభూతి, అప్రతిపత్తి మరియు మానవత్వం ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతి ఒక్కరి మనస్సులో కృతజ్ఞతను, ఉత్తమమైన, ప్రకాశవంతమైన, మరియు భద్రమైన రాబోయే కాలం కోసం ఆశలను నింపే జాతీయ గీతాలాపనతో ఈకార్యక్రమ౦ దిగ్విజయ౦గా ముగిసింది.