తెలుగునాడు, సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్వర్గీయనందమూరి తారక రామారావు గారి 29 వ వర్ధంతి వేడుకలను శనివారం భువనగిరి పార్లమెంట్ అడ్ హక్ కమిటీ మెంబర్ శ్రీపతి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సిని నటుడిగా,ముఖ్యమంత్రిగా తెలుగు జాతికి చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అవ్వారు సుబ్బారావు ,సీనియర్ నాయకులు కుందారపు యాదయ్య, నర్రి నరసింహ, నాయకులు నీళ్ల జంగయ్య, డాక్టర్ వెంకటేశం గౌడ్, భగవంతయ్య మరియు అన్ని గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు , మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
