- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, తెలుగునాడు ;
రెడ్డి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
నాచారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి .
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సంఘం అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఆయన.
తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుభాస్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రమణ రెడ్డి, భూపాల్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.