పౌర్ణమి అన్నదానం అభినందనలు : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Facebook
X
LinkedIn

హెచ్ బి కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద అన్నదాన వితరణ పౌర్ణమి అన్నదాన కార్యక్రమం

తెలుగునాడు, మీర్పేట్ హెచ్. బి కాలనీ :

మీర్పేట్ హెచ్. బి కాలనీలో మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్చి దగ్గర పౌర్ణమి,గోదాదేవి కల్యాణం మరియు భోగి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద పౌర్ణమి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద కమిటీ సభ్యులు తన్నీరు బ్రహ్మయ్య, విక్రమ్ ఠాకూర్, మురళి చారి, ఎన్ పవన్ కుమార్, ఆధ్వర్యంలో కాలనీ వారి సహాయ సహకారాలతో స్వచ్ఛంద అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహి ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద కమిటీ వాళ్ళు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మీర్పేట్ కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మునిగంటి రాంప్రదీప్, హెచ్.పీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ మెంబర్లు, కాలనీవాసులు అధిక దశలో పాల్గొన్నారు.