కాలనీ నివాసులదా వ్యాపారులదా……
పార్క్ ఓపెన్ స్థలల్లో పుట్టుకొస్తున్న అక్రమాలు
అద్దెల రూపంలో లబ్ధి పొందుతున్న కాలనీ సంక్షేమ సంఘాలు
సామాజిక ప్రయోజనాలకి వినియోగించాల్సిన స్థలాలు వ్యాపారుల పరం
తెలుగునాడు, ఏఎస్ రావు నగర్ :
హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాలలో మొదటి వరుసలో నిలబడింది. హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ విజ్ఞానవేత్త, మేధావి మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు గారి పేరు మీద 116 ఎకరాలలో ఏర్పడింది ఏఎస్ రావు నగర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏఎస్ రావు నగర్ తెలియని వారు లేరు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ కాలనీ కమర్షియల్ గా కూడా ఎంతో అభివృద్ధి చెందింది.

కాలనీలలో ఖాళీ స్థలాలు సమాజానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. క్రీడ మైదానాలు కమ్యూనిటీ సెంటర్లు వంటి సౌకర్యాలు ఈ స్థలాల్లో ఏర్పాటు చేయడం ద్వారా కాలనీలోని నివాసితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ కాళీ స్థలాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించి సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక గా నిలవాలి.
కానీ ఏ ఎస్ రావు నగర్ ప్రారంభంలో ఉన్న పెద్ద ఖాళీ స్థలం వ్యాపారులకు, దీపావళి క్రాకర్స్ అమ్ముకునే వారికి వేదికగా తయారయింది.
దీనిని అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా లబ్ధి పొందుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.
సంపాదనే ప్రాధాన్యతపరంగా ఉన్న ఈ కాలనీ అసోసియేషన్ కి ప్రజా ప్రయోజనాలు, సామాజిక హితం పట్టదన్నట్లు తెలుస్తుంది.
కాలనీ సంక్షేమ సంఘాలు తీసుకుంటున్న చర్యల వల్ల ఏ ఎస్ రావు నగర్ తన ప్రాధాన్యతను కోల్పోతుంది.
ఖాళీ స్థలాల వినియోగం నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనను పట్టించుకోకుండా కాళీ స్థలాన్ని వ్యాపారులకు అద్దెకివ్వడాన్ని పలువురు ఖండిస్తున్నారు.
కాలనీలలో ఖాళీ స్థలాల సద్వినియోగం సమాజానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కాలనీ సంఘాలు నివాసితులు, ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేస్తే ఈ స్థలాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. అందువల్ల ఖాళీ స్థలాల నిర్వహణలో కాలనీలలోని ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొనడం ఎంతో అవసరం.
