జ్ఞానసముపార్జనకు ఏకాగ్రత శక్తి అత్యంత కీలకమైనది

Facebook
X
LinkedIn

స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల్లో బడుగు శ్రీరాములు

 తెలుగునాడు, చౌటుప్పల్ ; జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల చౌటుప్పల లో శ్రీ పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు ప్రజ్ఞా పాట ఒక పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్నే శివకుమార్  అధ్యక్షత వహించారు. పాలకూర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చైర్ పర్సన్ పాలకూర మురళి గౌడ్ స్వాగతం ఉపన్యాసం చేశారు. ప్రముఖ సాహితీవేత్త సహస్ర ప్రహేలిక ప్రాజ్ఞులు బడుగు శ్రీరాములు క్విజ్ మాస్టర్ గా వ్యవహరించారు. ఈ సందర్బంగా   బడుగు శ్రీరాములు మాట్లాడుతూ జ్ఞానసముపార్జనకు ఏకాగ్రత శక్తి అత్యంత కీలకమైనదన్నారు. ఆపదలను అవకాశాలు గా మలుచుకుని చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రాచీన భారతదేశపు వీరుల, విదుషీమణుల వీర గాథలు రేపటితరానికి స్ఫూర్తి నీ నింపుతాయి కావున పుస్తక పఠనం చేయాలన్నారు.పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజేతలకు నగదు పారితోషికం తో పాటు వివేకానంద సాహిత్య పుస్తకాలు విద్యార్థులందరికీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు