రాష్ట్రంలో నేరగాళ్ల విచ్చల విడితనం పెరిగిపోయింది: కవిత  

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఎక్స్ జ్ పోలీసులంటే గంజాయి ముఠాలకు భయం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అబ్కారీ సిబ్బంది వద్ద ఆయుధాలుంటేనే స్మగ్లర్లకు భయం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ లో గంజాయి ముఠా చేతిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్న సౌమ్యను కవిత పరామర్శించి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఆబ్కారీ, అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలని, రాష్ట్రంలో నేరగాళ్ల విచ్చల విడితనం పెరిగిపోయిందని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ ను ఉద్యమకారులు, ప్రజలకు దూరం చేసింది మాజీ ఎంపి సంతోషేనని.. సంతోష్ రావు వల్లే గద్దర్ లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి గూఢచారి సంతోష్ రావు అని.. సంతోష్ రావుకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదని పేర్కొన్నారు. సిట్ పిలవడం సరే కానీ.. ఏం శిక్షలు పడతాయో చూడాలని అన్నారు. ఫాంహౌస్ లో మాజీ సిఎం కెసిఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నారా? సగం ఇడ్లీ తిన్నారా? అనే సమాచారం రేవంత్ కు చేరవేసేది సంతోష్ రావు అని.. బిఆర్ఎస్ లో ఎందరో నేతల కన్నీళ్లకు కారణం సంతోష్ రావేనని అన్నారు. బిఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్ కు కారణం సంతోష్ రావేనని, సంతోష్ రావు లాంటి వ్యక్తికి అనుకూలంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ లు పెట్టడానికి బిఆర్ఎస్ శ్రేణులు గమనించుకోవాలని సూచించారు. బిఆర్ఎస్ అన్ని దుర్మార్గాలకు కారణం సంతోష్ రావేనని, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తన గూఢచారిని రేవంత్ కాపాడుకుంటారని జోష్యం చెప్పారు. సిట్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కవిత కోరారు.