హరీష్ రావు,కేటిఆర్ శ్రీరంగ నీతులు చెప్తున్నారు

Facebook
X
LinkedIn

  వాళ్ళ మాటలు దయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉంది

హైదరాబాద్ :

హరీష్ రావు,కేటిఆర్ శ్రీరంగ నీతులు చెప్తున్నారని,వాళ్ళ మాటలు దయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 50 ఏండ్లు వెనక్కి తీసుకపోయారన్నారు.కులగణన, బిసి బిల్లును అసెంబ్లీ లోపెట్టిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు.మళ్ళీ అధికారంలోకి వస్తామని బిఅర్ ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చారుస్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బిఅర్ ఎస్ కు గుండు సున్నా ఖాయం బిఅర్ ఎస్ నాయకులు మాట్లాడిన మాటలను ప్రజలతో పాటు,మీడియా గమనించాలిఇప్పటికైన నిర్మాణాత్మక ప్రతి పక్షంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను స్వాగతించండిప్రభుత్వం తీసుకవస్తున్న విప్లవాత్మక మార్పులకు ప్రజలు తోడుగా ఉండాలన్నారు.