హైదరాబాద్ :
తెలంగాణలో పలుచోట్ల రాగల మూడురోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చియ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ప్రదేశ్ వరకు వ్యాపించిందని.. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. రాబోయే 24గంటల్లో తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా పశ్చియ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.