హరిష్ సంతోష్ లపై చర్యలు తీసుకోవాలి
గ్రేట్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రా రాజనాల శ్రీహరి డిమాండ్
వరంగల్ :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసినట్లుగా హరీష్ రావు సంతోష్ రావ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిల అవినీతి సంపాదన రికవరీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వినియోగించాలని గ్రేట్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు. వరంగల్ లో ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, హరీష్ రావు సంతోష్ రావు తో పాటు టిఆర్ఎస్ సహాయం లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి అవినీతి సొమ్మును రికవరీ చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన కోరారు. కవిత చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని , టిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలెపాక ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు కుమ్మరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.