పల్లె ప్రజలకు మెరుగైన చికిత్సలు

Facebook
X
LinkedIn

* గౌరాయపల్లి పల్లె దవాఖానలో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ

యాదగిరిగుట్ట :

పల్లెల్లో నివసించే ప్రజలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సలు అందించాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.శనివారం యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పల్లెలో నివసించే ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. గర్భిణీ స్త్రీల పర్యవేక్షణ, టీకాలు వేయడం జరుగుతుందా? అని ఆరాతీశారు.గ్రామంలో పారిశుద్ధ్యం పనులు సంబంధిత అధికారులు  చేస్తున్నారా? అని కూడా ఆరా తీశారు. గ్రామాలలో మెడికల్ క్యాంపు లు చేశారా? ఏమైనా జ్వరాలు వచ్చాయా? అని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు.ఈ దవాఖానా పరిధిలో గత నెలలో ఎన్ని ఈ డి డి లు వచ్చాయని, ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ లు జరిగాయని తెలుసుకున్నారు. పిల్లలకి టీకాలు తేదీల ప్రకారం వేయాలన్నారు.