ఫ్లైఓవర్ పనులతో గుట్టలో ట్రాఫిక్ డైవర్షన్

Facebook
X
LinkedIn

యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు, మండల ప్రజలకు పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ పై ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. పట్టణం గుండా కొండపైకి వెళ్లడానికి అసంపూర్తి గా ఉన్న ఫ్లై ఓవర్ పనులు తీరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేశారు . తుర్కపల్లి, మల్లాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రజలు పాత వాసవి సత్రం నుండి దేవస్థాన తులసి సత్రం  మీదుగా  వెళ్లి …రెడ్డి సత్రం దగ్గర  తుర్కపల్లి  మెయిన్ రోడ్  వెళ్ళాలి. తుర్కపల్లి, మల్లాపూర్ నుండి వచ్చే ప్రజలు యాదవ ఋషి సర్కిల్ నుండి గరుడ సర్కిల్  మీదుగా  పాదాలవైపు  రావలసి ఉంటుంది..  భారీ వాహనాలు అనగా స్కూల్ బస్సులు, లారీలు, ఆర్టీసీ బస్సులకు  పాదాల నుండి యాదవ్ రిషి సర్కిల్ వరకు భారీ వాహనాలకు అనుమతి లేదు. అట్టి వాహనాలు పాదాల నుండి  గరుడ సర్కిల్ మీదుగా యాదవ ఋషి సర్కిల్ గుండా  మల్లాపూర్,తుర్కపల్లి రావడానికి మరియూ పోవడానికి   ఈ మార్గం సూచించారు.  వాహనదారులు  ట్రాఫిక్ పోలీసులు సూచించిన విధంగా వెళ్ళాలి .ఆపోజిట్ లో వచ్చి  ప్రమాదాలకు   గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ లు విజ్ఞప్తి చేశారు.