42 శాతం బీసీ రిజర్వేషన్ల ను అసెంబ్లీలో మరోసారి చట్టం చేయండి

Facebook
X
LinkedIn

               పార్టీ పరంగా వద్దె – వద్దు..ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ :

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై రేపటి నుండి జరిగే అసెంబ్లీలో మరోసారి చట్టం చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు .ఈసారి చట్టం చేస్తే తప్పనిసరిగా గవర్నర్ పాస్ చేస్తారు. జీవో తీసి ఎన్నికలు జరపవచ్చు. మంత్రివర్గ కమిటి చేసిన మూడు ప్రతిప్రాదనలో ఒకటి GO తీసి ఎన్నికలు జరపాలని చేసిన సిపార్సు పూర్తిగా సమర్దిస్తామన్నారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో 42 శాతం పెట్టడానికి ఇష్టం లేక ప్రభుత్వం అనేక డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతుంది. ఢిల్లీలో రెండు సార్లు ధర్నాలు చేశారు, ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేసి పేపర్లలో ఉత్తుత్తి ప్రకటనలు జారీ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మభ్యపెడుతున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి యుంటే గవర్నర్ సంతకం పెట్టకపోతే సుప్రీంకోర్టులో మండమాస్ పిటిషన్ వేయవచ్చు. లేదా మరోసారి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేస్తే చట్టం తయారవుతుంది. జీవో జారీ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంకు పెంచడానికి ఇష్టం లేక కేంద్ర ప్రభుత్వంపై దుష్పాప్రచారం చేస్తుంది. తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపలేదు. ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో చర్చ చేయలేదు. బీహార్ దొంగ ఓట్లని అపవాదా చేస్తూ నెల రోజులు పార్లమెంట్ నడవకుండా స్తంబింప జేశారు. బి.సి రిజర్వేషన్ల విషయంలో ఒక రోజు కుడా పార్లమెంట్ లో చర్చ చేయలేదు. ఇండియా కూటమికి 250 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. ఎందుకు పార్లమెంట్ లో చర్చలేదు. దీనిని చూస్తే వారికి యున్న చిత్త శుద్ధి ఏమిటో తెలుస్తుంది. రకరకాలుగా ప్రజలను తప్పుతావా పట్టిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు.