పొంగిపొర్లుతున్న గండి చెరువు

Facebook
X
LinkedIn

ట్రాఫిక్ డైవర్షన్… పోలీసుల పహారా

యాదగిరిగుట్ట :

వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు… రహదారులు జలమయం అయ్యాయి. మండలంలో అనేక చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక పట్టణంలోని గండి చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో తూమ్ గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదిలారు. ముందు జాగ్రత్త చర్యగా యాదగిరి పల్లి వద్ద పోలీసులు డైవర్షన్ ఏర్పాటు చేశారు. వంగపల్లి నుండి యాదగిరిగుట్టకు వచ్చే వాహనాలు రింగురోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట నుండి వంగపల్లి వైపు వెళ్లే వాహనాలు రింగురోడ్డు పై నుండి యాదగిరి పల్లి మీదుగా వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.