ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు  

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :

అసెంబ్లీ సమావేశాలు   ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొదటి రోజు జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. ఈ సమావేశాల్లో ఉపసభాపతి ఎంపిక జరుపనున్నారు. కాళేశ్వరంపై సీపీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక గురించి చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేక సమావేశానికి సంబంధించి ఈ నెల 29న కేబినెట్‌ భేటీలో ఎజెండా ఖరారు కానుంది.