రాష్ట్రం అంతటికీ రెడ్‌ అలర్ట్‌ జారీ

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ   హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రం అంతటికీ రెడ్‌ అలర్ట్‌   జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

మరోవైపు హైదరాబాద్ ,  హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్‌ కలర్ వార్నింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని నాగరత్న వివరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.