నాగార్జున సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద‌.. 18 గేట్లు ఎత్తివేత‌

Facebook
X
LinkedIn

న‌ల్ల‌గొండ  :

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో కృష్ణా న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. జూరాల నుంచి మొదలుకుంటే నాగార్జున సాగ‌ర్ వ‌ర‌కు కృష్ణా న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. భారీ వ‌ర‌ద‌కు నాగార్జున సాగ‌ర్ నిండు కుండ‌లా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. జ‌లాశ‌యం పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 589.50 అడుగులుగా ఉంది. సాగ‌ర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుత నీటినిల్వ 310.55 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1,86,624 క్యూసెక్కులుగా ఉంది.