తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ కేసులో GHMC కి హైకోర్ట్ గడువు
హైదేవ్రాబాద్ :
తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసును హైకోర్టు న్యాయమూర్తి బి. విజయసేన్ రెడ్డి సమక్షంలో లిస్ట్ చేశారు. ప్రకాష్ ఆర్ట్స్ న్యాయవాది అనిల్ కుమార్ మరియు GHMC ప్రభుత్వ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కోర్టుకు హాజరై, తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి రెండు వారాల పొడిగింపును కోరారు. అయితే, మిగిలిన ప్రతివాదులు హాజరు కాలేదు.అందుకు న్యాయమూర్తి కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి 20 ఆగస్టు 2025 వరకు సమయం ఇచ్చారు. నేల స్థాయి నుండి 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే హక్కుకు సంబంధించి 209 దీర్ఘకాలంగా నమోదైన ఏజెన్సీలు మరియు 53 పిటిషనర్ ఏజెన్సీలకు న్యాయం కోరుతూ. తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ జూలై 9 న హైకోర్టును ఆస్రయించారు.ప్రస్తుతం, GHMC 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్‌లను నిర్వహించడానికి ఎంపిక చేసిన 3 ఏజెన్సీలను మాత్రమే ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతిస్తోంది, ఇది 2020లో జారీ చేయబడిన G.O. Ms. No. 68 యొక్క స్పష్టమైన ఉల్లంఘన. ఒక సంఘంగా, 209 పాత రిజిస్టర్డ్ ఏజెన్సీలు మరియు 53 పిటిషనర్ ఏజెన్సీలతో సహా అన్ని అర్హత కలిగిన ఏజెన్సీలకు 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్‌లను అనుమతించడానికి తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ న్యాయం చేయమని హైకోర్టు ను ఆస్రయించారు. అందుకు GHMC, MA&UD, HMRL, HYDRA, L&T, ప్రకాష్ ఆర్ట్స్, శ్రీ RLK కన్స్ట్రక్షన్స్ (లీడ్ స్పేస్), మరియు నవనిర్మాణ్ అసోసియేట్స్. నోటీసులు జారీ చేసింది.కావాలని GHMC ఇంకా తన ప్రతిస్పందనను సిద్ధం చేయలేదని మరియు ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని ఆలస్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది.