రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్‌ఐ

Facebook
X
LinkedIn

మహబూబ్‌నగర్‌  :

జిల్లాలో ఏసీబీ దాడులు   కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్   తహసీల్‌ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ బాలసుబ్రమణ్యంను  రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోగా ఆర్‌ఐ రూ.4వేలను డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో అధికారులు శుక్రవారం దాడులు చేసి ఆర్‌ఐను పట్టుకున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆర్‌ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. పబ్లిక్‌ సర్వెంట్‌ ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.