తెలంగాణలో మరోమూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Facebook
X
LinkedIn

                ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ

హైదరాబాద్ :

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో మరోమూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయన్న వాతావరణశాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.