హైదరాబాద్ :
హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన .. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. శుక్రవారం ను మించి వాన దంచి కొట్టడం తో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నారు. ప్యాట్నీ సెంటర్, పైగా కాలనీ, ఉప్పల్,నాచారం , బయో డైవర్సిటీతో పాటు పలు ఏరియాలు నీట మునిగి అటు వాహనదారులు, ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా అలాంటి పరిస్థితి తలెత్తుతే ఏంటని భయపడిపోతున్నారు.