* హెచ్ .వై .ఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి తో ఈవో భేటీ
* ఉత్తమ నాణ్యత ప్రమాణాల దిశగా ప్రసాదాల తయారీ
* గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ పై అధ్యయనం
* దేవస్థానం ఎలక్ట్రికల్ వైరింగ్ మేనేజ్మెంట్ పై థర్డ్ పార్టీ ఆడిట్
* ఈవో వెంకట్రావు కృషిపై భక్తుల్లో హర్షం
యాదగిరిగుట్ట :
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని తీర్చిదిద్దే క్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావు కృషి పై భక్తుల్లో ఆనందం కనిపిస్తోంది. భక్తుల సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరించడంతోపాటు, దేవస్థానంలోని అన్ని శాఖలలో లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నారు. “తిరుపతి లడ్డు _ యాదగిరిగుట్ట పులిహోర ” ప్రసాదం రుచిగా , శుచిగా ఉంటాయని ప్రతీతి. అందుకే ఫుడ్ సేఫ్టీ ఫర్ ప్రసాదం అనే విషయంలో స్టాండర్డ్స్ పై చర్యలకు ఉపక్రమించారు. HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.శివయ్య తో ఈవో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చర్చించారు. అదేవిధంగా దేవస్థానం నిర్వహిస్తున్న గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ పై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఈ విషయాలలో నాణ్యత ప్రమాణాలు ,అర్హతలు వంటి అంశాలను పరిష్కరింపజేయనున్నారు. అలాగే దేవస్థానం ఎలక్ట్రికల్ ఆడిట్ కూడా నిర్వహించనున్నారు. ఈ విషయంలో దేవస్థానం ఎలక్ట్రికల్ వైరింగ్ మేనేజ్మెంట్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించదలిచారు. HYM సంస్థ థర్డ్ పార్టీగా వ్యవహరిస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.