వైద్యసేవలో నిర్లక్ష్యం సహించం

Facebook
X
LinkedIn

యాదగిరిగుట్ట పిహెచ్  సి లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు

* ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలి

* ప్రసవాల సంఖ్య పెంచాలి

* అనధికారికంగా గైర్హాజర్ అయిన ల్యాబ్ టెక్నిషియన్ కు షోకాజ్ నోటీసు

యాదగిరిగుట్ట :

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు.ఆసుపత్రి లో ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ వార్డు లను పరిశీలించారు.ఆసుపత్రి లోని అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి ఎంత మంది సిబ్బంది విధులకు హాజరయ్యారని పరిశీలించారు.  డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపి రిజిస్టర్ ని చెక్ చేశారు. ప్రతి రోజూ ఆసుపత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు.  వైద్యులు  అందుబాటులో ఉండి.. వైద్యం కోసం వచ్చిన వారికి సకాలంలో స్పందించి వైద్యం అందించారు అన్నారు. ఆసుపత్రికి ఎంత మంది గర్భిణి స్త్రీలు వస్తున్నారని, ఎంత మంది చెకప్ చేసుకుంటున్నారని, వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా ఇస్తున్నారా లేదా అని అడిగి  తెలుసుకున్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు.ఆసుపత్రి  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ సుగుణ రాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.