ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నసిఎం రేవంత్ రెడ్డి

Facebook
X
LinkedIn

          విరుచుకపడ్డ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు  

హైదరాబాద్‌ :

పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు   అన్నారు. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరుతో అందరినీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడని మండిపడ్డారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. మీ వైఫల్యాలను నిలదీస్తామని, నమ్మించి నయవంచన చేసిన మీ మోస పూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.