ఉదారత్వాన్ని చాటుకున్న జగ్గారెడ్డి
సంగారెడ్డి
రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల ఆర్ధిక సాయం చేసి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు.సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరి ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. బాధితుడు హరిప్రసాద్ గురుకుల పాఠశాలలో చిన్న ఉద్యోగం 13 వేల జీతం….లక్షల్లో ఖర్చు అయ్యే క్యాన్సర్ తో పోరాటం చేయడం అంటే ఎంత కష్టం పేద కుటుంబం కావడం తో వైద్యానికి డబ్బులు లేకోవడం తో జగ్గారెడ్డిని ఆస్రయించారు. దీనితో జగ్గ రెడ్డి 10 లక్షల ఆర్ధిక సాయం అందింఛి ఉదారత్వాన్ని చాటుకున్నారు.కాగా క్యాన్సర్ ట్రీట్ మెంట్ లక్షల రూపాయల తో కూడుకున్న వ్యవహారం కావడం తో పేద లు ఆర్థికం గా చితికిపోతున్నరు.తన నియోజకవర్గం లో క్యాన్సర్ తో బాధపడే నిరుపేద లకు ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు