ప్రముఖ సామాజిక ఉద్యమ నేత బండారి రవికుమార్ కి టిపిఎస్ కె స్ఫూర్తి గ్రూప్ ప్రచురణలు అందజేత

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, ప్రజాస్వామ్య పరమైన విషయాలపై సోషల్ మీడియా వేదికగా విశ్లేషణ చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్న బండారు రవికుమార్ కు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూపు ప్రచు రించిన మూడు సాహిత్య గ్రంథాలను టి పి ఎస్ కె స్ఫూర్తి బాధ్యులు గొడుగు యాదగిరిరావు, జె శ్రీమన్నారాయణ అందజేశారు. అందులో జీవన గమనంలో జీవిత కథలు, జీవితం మలుపుల మధ్య జ్ఞాపకాల అనుభూ తులు, మేము సైతం- సమకాలీన సామాజిక అంశాలపై స్ఫూర్తి గ్రూపు సభ్యులు రాసిన వ్యాస సంకలనం అందజేశారు. నాటి వరవడి.. నేటి నడవ డి- గొడుగు యాదగిరిరావు రచనగా కాలానుగుణమైన కవితల సంకలనం అందజేశారు. కార్యక్రమంలో స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గొడుగు యాదగిరిరావు, శ్రీమన్నారాయణ పాల్గొని, రచనలు, పుస్తకాల ఉద్దేశ్యం వివరించారు. పుస్తకాలు స్వీకరించిన బండారు రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.