హైదరాబాద్ :
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు. సిఐఐ, గ్రీన్ కో ఆధ్వర్యంలో ‘ గ్రీన్ కో ’ సమ్మిట్ ను ప్రారంభించారు. ‘గ్రీన్ కో’ సమ్మిట్ కు ముఖ్య అతిధిగా శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2025 జూన్ 12, 13 తేదీలలో హైదరాబాద్‌లో గ్రీన్ కో’ సమ్మిట్ జరుగుతుందని, ఈ సమ్మిట్ సుస్థిరత, గ్రీన్ టెక్నాలజీ, బాధ్యతాయుత వ్యాపార పద్ధతులకు అంకితం చేయబడిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు కొత్త పాలసీ తెచ్చామని అన్నారు. సాంకేతికతతో కాలుష్యాన్ని తగ్గించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.