ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాలి

Facebook
X
LinkedIn

రాష్ట్ర కీర్తి ప్రతిబింబించేలా విజయోత్సవాలు

ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటే లా అధికారులు ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలో జూన్ 2న జరుగుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం ఆ తరువాత పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న జెండా వందనం, మార్చ్ ఫాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రధానంగా హైదరాబాద్ ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో ఇంచార్జి మంత్రులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వాణపై సమీక్షించారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ట్ర అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారని ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్ మూలంగా గత సంవత్సరం అనుకున్న మేరకు పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోయాం ఈసారి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తుంటారు ఎక్కడైనా ఏ అధికారికైనా ఎలాంటి ఇబ్బంది లేదా ఉత్సవాలు గొప్పగా నిర్వహించేందుకు మంచి ఆలోచనలు ఏవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని అధికారులు ఎలాంటి సంశయానికి గురికావలసిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,
డిజిపి జితేందర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ cs లు వికాస్ రాజ్ ,రఘునందన్ రావు, సమాచార శాఖ కమిషనర్ హరీష్, పోలీస్ అధికారులు సివి ఆనంద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.