అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో రఘుపాల్ సంతాప సభలో వక్తల ఉద్గాటన
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఉద్యమంలోనూ కమ్యూనిస్టు మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమంలోనూ కామ్రేడ్ జి. రఘు పాల్ నిబద్దతతో కమ్యూనిస్టు క్రమశిక్షణతో పోరాటాలు నిర్వహించారణి సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు అజీజ్ పాషా, aipso జాతీయ నేత పీస్ అవార్డు గ్రహీత కే .యాదవ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్సీ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, సిపిఐఎం రాష్ట్ర సెక్రటేరియట్ నెంబర్ కామ్రేడ్ అబ్బాస్, అరుణోదయ విమలక్క,aipso రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్, రఘుపాల్ సంతాప సభలో తెలియజేశారు
ఈరోజు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లోaipso రాష్ట్ర కార్యాలయంలో aipso రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి నాగేశ్వరరావు అధ్యక్షతన కామ్రేడ్ రఘుపాల్ సంతాప సభ జరిగింది .
ఈ సభలో అజీజ్ పాషా మాట్లాడుతూ రఘుపాల్ కష్ట కాలంలో ఈ హైదరాబాద్ ప్రాంతంలో సిపిఐ ఎం పార్టీ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించారని అటు తర్వాత శాంతి సంఘం ఉద్యమంలో ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారని అన్నారు. ఆయన దూరదృష్ట కలిగిన వ్యక్తి అని కమిట్మెంట్ ఉన్న కామ్రేడ్ అని ఆయనకు కమ్యూనిస్టు పార్టీ పక్షాన నివాళులర్పించారు. జాతీయ పీస్ అవార్డు గ్రహీత అయిన జాతీయ నేత కే యాదవ రెడ్డి మాట్లాడుతూ రఘుపాల్ 83 ఏళ్ల వయసు మీద పడ్డప్పటికీ ఎన్నడు కూడా వయోభారమైనటువంటి కారణాలత ఉద్యమాలకు దూరంగా ఉన్న సందర్భాలు లేవని అన్నారు. అన్ని సమావేశాలకు సమయా సమయం కంటే ముందే హాజరయ్యే వ్యక్తిని అన్నారు. శాంతి ఉద్యమాలలో జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలలో కలిసి ఉన్నామని చేశారు వారి మృతికి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ రఘుపాల్ కమ్యూనిస్టు ఉద్యమ అనే పద్యం నుండి వచ్చారని ఆయన నిత్యం తన ఆలోచనలతో వామపక్ష ఉద్యమాల బలోపేతం గురించి ప్రజలలో స్ఫూర్తిని నింపే వారనీ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి తో పాటుగా ఒకటి రెండు మినహా అన్ని జిల్లాలను తిరిగి ఉద్యమం కోసం కృషి చేశారని అన్నారు.

aipso జాతీయ అధ్యక్షులకు సభ్యులు డాక్టర్ డి సుధాకర్ మాట్లాడుతూ రఘుపాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రఘుపాల్ నిత్యం రాష్ట్ర కేంద్రా అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న నాయకుడని అన్నారు. వారి సేవలు మరువలేనివి అని అన్నారు.
పి ఐ ఎం రాష్ట్ర సెక్రటేరియట్ నెంబర్ కామ్రేడ్ అబ్బాస్ మాట్లాడుతూ రఘు పాల్ కమ్యూనిస్టు శాంతి ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు ఆయన గొప్ప మానవతా వాదని ఆయన ఎందరినో సహృదయంతో ప్రేమించాడని కార్యకర్తల ప్రోత్సహించాలని కృషి చేశారని అన్నారు. అరుణోదయ నాయకురాలు విమలక్క మాట్లాడుతూ రఘుపాల్ గారి శక్తి విల్ పవర్ శారీరక దృఢత్వం చాలా గొప్పదని షో టీం లో మేమంతా చైనాకు వెళ్ళిన సందర్భంగా వారు చూపిన చు చర్చించిన విషయాలను మర్చిపోలేని వని నివాళులర్పించారు.
ఐ సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేపీఎల్ మాట్లాడుతూ పోరాట బాటలో నేను చాలా సందర్భాల్లో గంటల కొద్ది మీటింగ్లలో రైళ్లలో, బస్సులలో, ప్రయాణం సందర్భంగా సంఘీభావ సంగం ఉద్యమ ప్రాధాన్యతను, ఈ సంఘమును పీపుల్స్ ఆర్గనైజేషన్ గా తీర్చిదిద్దడానికి కావలసిన, తీసుకోవలసిన అనేక విషయాల గురించి మాట్లాడుకున్నామని, అన్నారు రఘుపాల్ ఈ ఉద్యమ వ్యాప్తికి చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి నాగేశ్వరరావు రఘుపాల్ తో తనకున్న అనుబంధాన్ని, పోరాటంలో కుటుంబంలో రఘు పాల్ జీవించిన విధానాన్ని తెలియజేశారు కార్యకర్తల కృషి చేశారని అన్నారు.
ఈ సంతాప సభలో రాష్ట్ర జిల్లా నాయకులు వెంకట్రాం రెడ్డి , గురు బచ్చన్ సింగ్ ,రామరాజ్, ప్రేమ పావని, డాక్టర్ సమత రోషిని, అనూష, కమలా రెడ్డి నరహరి, పి ఎస్ ఎన్ మూర్తి, తిప్పర్తి మహేష్, జగన్మోహన్, లక్ష్మీకాంతం. జెకె శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, డాక్టర్ జి గోపి ,హర్ష అహ్మద్, బొమ్మగాని నాగభూషణం, వెంకట్ గౌడ్, రఘుపాల్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
రఘు పాల్ గారి మరణాన్న అనంతరం తన దేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కు ఇచ్చిన సందర్భంగా రఘుపాల్ గారి కుమారుడు డాక్టర్ గోపిని సన్మానించారు









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.